
అమరావతి : 11-12-25:-ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళల వికాసానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని చేనేత–జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. జాతీయ హస్తకళల వారోత్సవాల సందర్భంగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన 2023, 2024 జాతీయ అవార్డుల్లో ఏపీకి ఐదు పురస్కారాలు లభించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే కారణమని అన్నారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి సవిత వివరాలు తెలియజేశారు.2023కు సంబంధించితోలు బొమ్మల తయారీలో డి. శివమ్మకు మహిళల విభాగంలో శిల్ప గురు అవార్డుకలంకారి హ్యాండ్ పెయింటింగ్‌లో విజయలక్ష్మికి జాతీయ హస్తకళ అవార్డు2024కు సంబంధించిఏటికొప్పాక బొమ్మల తయారీలో గోర్సా సంతోష్‌కు జాతీయ అవార్డుతోలు బొమ్మల తయారీలో కందాయ్ అంజన్నప్పకు,తోలుబొమ్మల క్రాఫ్ట్ విభాగంలో ఖండే హరనాథ్‌కు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు లభించాయి.
అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందాయన్నారు. హస్తకళాకారుల శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక భరోసా వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ పురస్కారాలకు మార్గం సుగమం చేశాయని మంత్రి పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.13న శ్రీకాళహస్తిలో సన్మానంజాతీయ హస్తకళల వారోత్సవాల నేపథ్యంలో ఈ నెల 13న శ్రీకాళహస్తిలో అవార్డు గ్రహీతలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించనుందని సవిత తెలిపారు. అదే కార్యక్రమంలో 100 మంది హస్తకళాకారులకు ఒక్కొక్కరికీ రూ.10,000 విలువ చేసే టూల్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.అవార్డు గ్రహీతలకు మంత్రి సవిత అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో హస్తకళలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కృషిని కొనసాగిస్తుందని తెలిపారు.







