
బాపట్ల:11-12-2025:-కుల, మత, రాజకీయ భేదాలు పట్టించుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న ప్రజానాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు.
బాపట్లలో మాజీ సైనికులతో కలిసి ఆయన సతీష్ ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ— “ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్న సతీష్ ప్రభాకర్ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.శుభాకాంక్షల కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టా ఆదిశేషా రెడ్డి, ఉపాధ్యక్షుడు చలికొండ వెంకట కృష్ణారావు, జనరల్ సెక్రటరీ షేక్ మొయినుద్దీన్, ట్రెజరర్ పువ్వాడ యల్లమంద, జాయింట్ సెక్రటరీ పీటా సారధి, సీనియర్ మాజీ సైనికుడు తోట దుర్గారావు, జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, అలాగే డి.వెంకటేశ్వర్లు, రుక్మదరరావు తదితరులు పాల్గొన్నారు.







