
గుంటూరు, అక్టోబర్ 12:అన్బెపర్రులోని ప్రభుత్వ వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ ఎన్. మార్కండేయును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి హాస్టల్‌లో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు, వార్డెన్ విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించారు. దాంతోపాటు బాధ్యతలపట్ల నిర్లక్ష్యం కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఘటన విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.







