గుడివాడ, :సెప్టెంబర్ 20, 2025:- గుడివాడలోని విశ్వభారతి హై స్కూల్ లో ప్రఖ్యాత నటుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా. అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీ పొట్లూరి శ్రీమన్నారాయణ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఏఎన్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నటించిన సినీపాటలపై విద్యార్థులు ఆకర్షణీయమైన నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ –
“ఏఎన్ఆర్ గారు కృషితో, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారి సూచనల మేరకు విశ్వభారతి విద్యాసంస్థలు ఏర్పాటు చేసి, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.