
జంగారెడ్డిగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని విక్టరీ ప్రైడ్ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎస్కే సుభాషిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్లోని మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.
మహిళలే సమాజానికి వెన్నెముక
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ.. ఆధునిక సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు.
“నేడు మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ తమ అద్భుత ప్రతిభను చాటుతున్నారు. ప్రతి విజయవంతమైన కార్య వెనుక ఒక మహిళా శక్తి దాగి ఉంటుంది.” అని పేర్కొన్నారు.
ఉత్సాహంగా వేడుకలు
వేడుకల్లో భాగంగా మహిళలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మహిళా సాధికారతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ నివాసితులు, స్థానిక మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.http://ELURU NEWS







