
అనంతసాగరం, అక్టోబర్ 13-10-25:-అనంతసాగరం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న ప్రఖ్యాత ఆస్తాన ఏ మష్ కూరియాలో శ్రీ శ్రీ శ్రీ హజ్రత్ మహబూబ్ సుభాని స్వామి వారి జల్స ఎ గ్యార్మి గంధ మహోత్సవం ఈ నెల 18న శనివారం రాత్రి ఘనంగా నిర్వహించనున్నారు
ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతులు గురువర్యులు హజ్రత్ సానీ సాహెబ్, హజ్రత్ మాజీద్ సాహెబ్ లు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై, ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
 
  
 






