
మచిలీపట్నం: డిసెంబర్ 12:-బందరు సబ్‌డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా విగ్రహాల ఏర్పాటు ఇక కఠిన నియంత్రణలోకి రానున్నది. గౌరవనీయ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని బందరు డి.ఎస్.పి సిహెచ్ రాజా స్పష్టం చేశారు.డి.ఎస్.పి తెలిపారు…
Nandha Jyothi
సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు విగ్రహాల ఏర్పాటు కోసం ఎటువంటి అనుమతులు జారీ కాలేదని, ఈ అంశాన్ని ప్రతి గ్రామ–పట్టణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు చేపడుతున్న చట్టపరమైన చర్యలకు స్థానికులు సహకరించి, శాంతియుత సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని లుపునిచ్చారు
ఇకపై నియమాలు ఉల్లంఘించి, అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసిన ఎవరినైనా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కఠిన చర్యలు తప్పవని డి.ఎస్.పి హెచ్చరించారు.ప్రజల భద్రత, సామాజిక ఐక్యత దృష్ట్యా ప్రతి ఒక్కరూ చట్ట నియమాలను గౌరవించాలని, అధికారులతో సహకరించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.










