
రేపల్లె: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ILA) రాష్ట్ర కన్వీనర్ గొర్రెముచ్చు శాంత కుమార్ ఘన విజయం సాధించడం పట్ల రేపల్లె కమిటీ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక న్యాయస్థాన ఆవరణలో ఐఎల్ఏ ప్రతినిధులు ఈ విజయాన్ని పురస్కరించుకుని మిఠాయిలు, పానీయాలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, దళితుల హక్కుల కోసం, బహుజన వర్గాల సమస్యల పరిష్కారం కోసం శాంత కుమార్ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. అంబేద్కర్, ఫూలే ఆశయాలతో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ను స్థాపించి, రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తు చేసుకున్నారు. బార్ కౌన్సిల్లో ఒక ‘ప్రశ్నించే గొంతుక’ ఉండాలని ఆశించిన రాష్ట్ర న్యాయవాదులు, ప్రాధాన్యత ఓట్లతో ఆయనను గెలిపించడం అభినందనీయమన్నారు. ఈ విజయం భవిష్యత్తులో బహుజన వర్గాలు ఎదుర్కొనే సమస్యలపై పోరాడేందుకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ సహాయ న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ఐజక్, మరియు న్యాయవాదులు నాలాది పోతురాజు, పెరికల జీవన్ కుమార్, గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, కంచర్ల రవికుమార్, పెద్దపల్లి జాన్ హానోక్, దోవా రమేష్, రాంజీ, ఎడ్ల గోపిరాజు, మునిపల్లి సుబ్బయ్య, గుంటూరు విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS







