
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు లో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలం సాయి వెంకటేశ్వర రెడ్డి ప్రేమించి మోసం చేయడంతో ఎస్పీ గ్రీవెన్స్ ను ఆశ్రయించింది నంబూరు కు చెందిన బండ్ల దీపిక సాయి వెంకటేశ్వర రెడ్డి ది నరసరావుపేట వద్ద విప్పర్ల రెడ్డిపాలెం. సాయి వెంకటేశ్వర్ రెడ్డి నంబూరు వాళ్ళ అక్క దగ్గరకు వచ్చి బండ్ల దీపిక ను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఇద్దరు లేచిపోయి కాకినాడలో పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో కాపురం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న అబ్బాయి బంధువులు వెళ్లి అతన్ని తీసుకొని వచ్చారు. బండ్ల దీపిక ఫోన్ చేసిన సాయి వెంకటేశ్వర్ రెడ్డి లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పెదకాకాని పోలీసులు సాయి వెంకటేశ్వర్ రెడ్డి అని పిలిచి మాట్లాడి ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబ సభ్యులను మాట్లాడుకోమని చెప్పారు. అబ్బాయి నెల రోజులు కలిసి ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదేమని ప్రశ్నిస్తే నువ్వు ఎస్సీవి నేను ఓసీని అని చెబుతున్నాడు. నీకు చేతనైంది చేసుకో నేను రాను వేరే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు. సాయి వెంకటేశ్వర్ రెడ్డి కి నాకు ఒక బాబు జన్మించాడు. మరల అతను వెళ్ళిపోవడంతో పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాను. సంవత్సరం నుండి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అతని గురించి ఎంక్వయిరీ చేసి విచారిస్తే నీకు చేతనైంది చేసుకోమని నాకు చెబుతున్నాడు. నన్ను వదిలించుకునేందుకు నాపై నిందలు వేస్తున్నాడు. మా బాబుకు సాయి వెంకటేశ్వర్ రెడ్డి కి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. అలాంటి వారిని వదిలిపెట్టకుండా శిక్షించాలి నాకు న్యాయం చేయాలి. మరొకరి జీవితం నాశనం కాకుండా ఇలాంటి కామాంధులకు తగిన శాస్తి చేయాలని ఎస్పీని కోరిన బాధితురాలు.








