ఆంధ్రప్రదేశ్
Trending

@AP ECET కౌన్సిలింగ్: మూడో విడతపై కీలక నిర్ణయం నేడు జరిగే అవకాశం !

@AP ECET కౌన్సిలింగ్: మూడో విడతపై కీలక నిర్ణయం నేడు జరిగే అవకాశం !

City News తెలుగు ప్రతినిధి: అమరావతి :ఆగస్ట్ 30

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ (AP ECET) అడ్మిషన్లలో మరో విడత కౌన్సిలింగ్ చేపట్టాలా అనే అంశంపై ఉన్నత విద్యా మండలి ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తవగా, ఇంకా వేల సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

ఎందుకు పెండింగ్‌లో మూడో విడత?

గతంలో కూడా ఈ సమస్య ఉంది
ఈ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) బ్రాంచ్‌లో సీట్లు పెరగడంతో పాటు కొన్ని యూనివర్స్టీలాగా కాలేజ్ లు మారాయి.విద్యార్థులంతా అదే వైపు ఆకర్షితులయ్యారు. ఫలితంగా ECE, EEE, Mechanical, Civil వంటి ఇతర ప్రధాన బ్రాంచ్‌లలో కొన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. అదనంగా, కొంతమంది విద్యార్థులు ఇప్పటికే పొందిన సీట్లను మార్చుకోవాలని కోరుకుంటుండటంతో మరో విడత కౌన్సిలింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని విద్యార్థులు తల్లిండ్రులు భావిస్తున్నారు

విద్యార్థులలో అపోహ – నిపుణుల హెచ్చరిక :

చాలామంది విద్యార్థులు “CSEలోనే ఉద్యోగాలు ఉంటాయి, మిగతా బ్రాంచ్‌లకు అవకాశాలు తక్కువ” అనే అభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే నిపుణులు ఇది ఒక అపోహ మాత్రమేనని చెబుతున్నారు.
వాస్తవానికి –

  • ECE (ఎలక్ట్రానిక్స్): 5G, మొబైల్ చిప్స్, సెమీకండక్టర్ పరిశ్రమలో విపరీతమైన డిమాండ్. Qualcomm, Intel, Samsung వంటి గ్లోబల్ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేస్తున్నాయి.
  • EEE (ఎలక్ట్రికల్): సౌరశక్తి, విండ్ ఎనర్జీ, EV రంగాల్లో విస్తృతమైన అవకాశాలు. NTPC, Tata Power, Siemens వంటి సంస్థలు నిరంతరం నియామకాలు చేస్తున్నాయి.
  • Mechanical: EV టెక్నాలజీ, రోబోటిక్స్, ఏరోస్పేస్ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. ISRO, DRDO, Tata Motors, BHEL వంటి సంస్థలు మెకానికల్ ఇంజనీర్లను విస్తృతంగా నియమిస్తున్నాయి.
  • Civil: దేశ అభివృద్ధికి పునాది. మెట్రోలు, రోడ్లు, డ్యామ్‌లు, స్మార్ట్ సిటీల నిర్మాణంలో సివిల్ ఇంజనీర్ల అవసరం ఎప్పటికీ ఉంటుంది. L&T, Adani Infra, GMR వంటి కంపెనీలు తరచుగా నియామకాలు చేస్తున్నాయి.
  • అవగాహన అవసరం ఉదాహరణకు
  • ప్రపంచస్థాయి టెక్ దిగ్గజాలకు నాయకత్వం వహిస్తున్న సీఈఓలలో చాలామంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌కి చెందిన వారు కారు.
  • సత్య నాదెళ్ల (Microsoft) – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • సుందర్ పిచాయ్ (Google) – మెటలర్జికల్ ఇంజనీరింగ్
  • అరవింద్ కృష్ణ (IBM) – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
  • ఎన్. చంద్రశేఖరన్ (Tata Sons) – మెకానికల్ ఇంజనీరింగ్
  • ఇది విద్యార్థులకు స్పష్టంగా తెలుసుకోవాలి .

ప్రభుత్వ నిర్ణయం – విద్యార్థులకు మరో అవకాశం

ఉన్నత విద్యా మండలి ఈ రోజు సమావేశమై మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలా అనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం . ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ మళ్లీ ఓపెన్ అవుతాయి. సీటు మార్పు కోరుకునేవారికి, ఇంకా సీటు పొందని వారికి ఇది ఒక మంచి అవకాశం కానుంది.

మా పరిస్థితి ఏమిటి: అంటున్న ఇంజనీరింగ్ కాలేజ్ యజన్యాలు

ఇక ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయని ఫీ రీఎంబర్స్‌మెంట్ కారణంగా అనేక కాలేజీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లెక్చరర్ల జీతాలు చెల్లించలేకపోవడం, ఖాళీగా ఉన్న సీట్ల వల్ల అదనపు ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు మరింత భారమవుతున్నాయి. అటు ప్రభుత్వాన్ని అడగలేక ఇటు జీతాలు చెల్లించ లేక ఇబ్బంది పడుతున్నమని కాలేజ్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.ప్రభుత్వం త్వరగా ఫీజ్ రీయంబర్స్ మెంట్ నిధులు కాలేజ్ లకు విడుదల చేస్తే ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సాగుతుందని అంటున్నారు

AP ECET కౌన్సిలింగ్ మూడో విడతపై నేటి నిర్ణయం విద్యార్థులు, కాలేజీలు రెండింటికీ కీలకంగా మారనుంది. విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో కేవలం CSEకే పరిమితం కాకుండా ఇతర రంగాలలో ఉన్న అవకాశాలను అర్థం చేసుకోవాలి. మరోవైపు కాలేజీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటే ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో సమతుల్యత ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker