వినుకొండ, ఆగస్టు 2: చదువును మధ్యలో ఆపేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, చేతివృత్తుల వారు, ఇంకా చదవలేకపోయిన ప్రతిఒక్కరికీ శుభవార్త. ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఇప్పుడు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదవడానికి అవకాశం కల్పిస్తున్నారు.
15 సంవత్సరాలు నిండిన వారు పదోతరగతి (SSC)లో చేరవచ్చు. అలాగే, పదో తరగతి పాస్ అయినవారు ఇంటర్మీడియట్ విద్యను ఓపెన్ స్కూల్ ద్వారా కొనసాగించవచ్చు. ఇది ఒకే సంవత్సరంలో చదివే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఓపెన్ స్కూల్ ద్వారా పొందే సర్టిఫికెట్లు ప్రభుత్వానికీ, ఉద్యోగ అవకాశాలకీ పూర్తి గుర్తింపు పొందినవే. రెగ్యులర్ చదువుతో సమానంగా పరిగణించబడతాయి. ఇది చదువు కొనసాగించాలనుకునే పెద్దలకు, మహిళలకు, ఉద్యోగరంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నవారికి ఒక చక్కటి అవకాశం.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఉన్న అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 15-08-2025.
మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు గారు పేర్కొన్న ప్రకారం, 94900 06556 నంబరుకు కాల్ చేయవచ్చు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ విద్యను కొనసాగించాలని కోరారు.