Bank Employee Tirumala Rao Killed His Wife and Wanted to Settle Down with His Girlfriend Abroad
భార్యను చంపి ప్రియురాలితో విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు
సర్వేయర్ హత్య విషయంలో బయటపడుతున్న సంచలన విషయాలు
తన భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకొని, ముందుగా లడఖ్ వెళ్లి అక్కడినుండి విదేశాలకు వెళ్లి సెటిల్ అవుదామని, అందుకోసం విమాన టిక్కెట్లు కూడా సిద్ధం చేసుకున్న తిరుమలరావు
దానికి అడ్డుగా ఉన్న భార్యను చంపేద్దామని నిర్ణయించుకోగా, భర్త కుట్రను ముందే పసిగట్టిన భార్య జాగ్రత్త పడడంతో, తేజేశ్వర్ ను చంపుదామని నిర్ణయించుకున్న తిరుమలరావు
రూ.20 లక్షలు లోన్ తీసుకొని అందులో రూ.2 లక్షలు తేజేశ్వర్ ను హత్య చేసిన గ్యాంగుకు ఇచ్చాడని, మిగతా రూ.18 లక్షలు సీజ్ చేశామని తెలిపిన పోలీసు అధికారులు
తన తల్లి, చెల్లికి తిరుమలరావుతో ఉన్న సంబంధం నచ్చక పలుమార్లు వారిని ఐశ్వర్య అన్న నవీన్ తిట్టేవాడని తెలిపిన స్థానికులు
ఇటీవల ఇంట్లో జారిపడి మరణించాడని తెలిపిన ఐశ్వర్య అన్న నవీన్ మృతిపైన కూడా అనుమానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతామని తెలిపిన పోలీసులు