
పల్నాడు జిల్లా దాచేపల్లి

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా యరపతినేని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి విజినరీ ముఖ్యమంత్రి ఉండటం వలన మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు.
ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వంలో రెండు రోజుల్లో 14 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. అంతకు ముందు 6 లక్షల కోట్లు పెట్టు బడులు వచ్చాయని గుర్తు చేశారు.
ప్రపంచ దిగ్గజాలు అయిన గూగుల్, ఆదాని, రిలయన్స్, టాటా, టి.సి.ఎస్ సంస్థలు అన్ని మన రాష్ట్రానికి రావడం అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం తోనే వచ్చాయని అన్నారు.
గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పరిపాలన అగమ్యగోచారంగా ఉండడం వలన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ముందుకు రాలేదన్నారు. ఒకవేళ వచ్చినా కూడా అందులో వాటాలు అడిగేవారని అన్నారు.
అప్పటికే రాష్ట్రంలో నడుస్తున్న అమరాన్ బ్యాటరీస్ లాంటి పరిశ్రమలు వీళ్ళ ఆరాచకానికి పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయాయని అన్నారు.







