
సినీ దర్శకుడు అనిల్ రావిపూడి గుంటూరులో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్” సినిమా విజయోత్సాహంలో భాగంగా నాజ్ థియేటర్, మైత్రిమాల్స్ లో ప్రేక్షకులను కలుసుకున్నారు. మెగా అభిమానులతో కలిసి సందడి చేశారు. ఈ సంక్రాంతికి మాత్రమే కాకుండా ప్రతీ సంక్రాంతికి అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు. మెగాస్టార్ అభిమాన సంఘ నాయకులు మేకల రవీంద్రబాబు, ఆళ్ళహరి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని అనిల్ రావిపూడిని సత్కరించారు. తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని వారు వెల్లడించారు.







