
మంగళగిరిలోని అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా గుంటూరు పాత బస్టాండ్ వద్ద అంజుమన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్, సిపిఐ నేత షేక్ వలి, ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.. మంగళగిరిలోని అంజుమన్ భూములను డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటుంది.. అంజుమన్ భూములను డెవలప్మెంట్ కి ఇస్తే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను, నాకు అంత ధైర్యం ఉంది.. మీ ఇష్టాలను, అయిష్టాలను తెలియజేయండి అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. వైఎస్సార్సీపీ నేత షేక్ గులాం రసూల్ మాట్లాడారు. మంగళగిరిలోని అంజుమన్ భూములను కూటమి ప్రభుత్వం తీసుకునేందుకు విడుదల చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. నారా లోకేష్ పీఏ గుంటూరు కలెక్టర్ కు అంజుమన్ భూమి కావాలి అని లేఖ స్వయంగా లేఖ రాశారు. అంజుమన్ భూమిని తీసుకునే హక్కు కూటమి ప్రభుత్వానికి ఒక్క శాతం కూడా లేదు. అంజుమన్ భూమిని లాక్కోవాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రసంగాలలో మైకులు ఆపవచ్చు.. కానీ ముస్లింల గొంతు నొక్కలేరు. అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి రాజధాని కోసం తీసుకున్న వేల ఎకరాల భూమిలోనే ఇంతవరకు అభివృద్ధి లేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు గుండెపోటులతో మృతి చెందే పరిస్థితి వచ్చింది. అంజుమన్ భూమిలో గుప్పెడు మట్టి కూడా తీసుకోవడానికి వీలు లేదు. నారా లోకేష్ కోసమే అంజుమన్ భూమిని తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. మతాలకు సంబంధించిన ఆస్తులను ఆయా వర్గాల అభ్యున్నతి కోసం మాత్రమే వినియోగించాలి. నారావారిపల్లెలో ఖర్జూర నాయుడు ఆస్తులు ఉంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుకోండి. హెరిటేజ్ ఆస్తులను ఉచితంగా ఇచ్చుకోండి. మా ఆస్తుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోము. అంజుమన్ భూమిని తీసుకుని ఆలోచన తక్షణమే విరమించుకోవాలి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గతంలో అంజుమన్ ఆస్తులు గురించి ఏం మాట్లాడారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాజీ మస్తాన్ వలీ, సీపీఐ నాయకులు షేక్ వలీ తెలిపారు.







