
అమరావతి రాజధానిలో విట్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్ వర్మ గౌరవ అతిథిగా, విట్ వ్యవస్థాపకులు, కులపతి జి. విశ్వనాథన్ హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా 3 వేల మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ అమరావతి రాజధాని, రైతుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం’ అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన కవిత్వాన్ని ఆయన ప్రస్తావించారు. ‘కృష్ణా నది నాగరికతలో సామాన్య జీవితం ఎవ్వరిది… అమరావతి నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని తనదైన శైలిలో అన్వయించారు. అదేవిధంగా డిగ్రీ మొదటి ద్వారాం మాత్రమే అని నిరంతరం చదువు కొనసాగించాలని అతిధిలు సూచించారు.సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. డేట్ బేస్, ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరాయి.సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.







