
రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలని నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. బుధవారం బుధవారం గుంటూరు విచ్చేసిన మంత్రి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పలనాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ తో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ అంశాలను చర్చించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో అనేక సంస్థలకు స్థలాలను కేటాయించడం జరిగిందని చెప్పారు. రైతుల భూమికి విలువ పెరగాలని, అందుకు ఆర్దిక కార్యకలాపాలు పెరగాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడానగరం అభివృద్ధి కావాలని అన్నారు తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. ఈ విషయాలు పట్ల సి.ఆర్.డి.ఏ కమిషనర్, అదనపు కమిషనర్, కలెక్టర్లు, శాసనసభ్యులతో చర్చించామన్నారు. భూ సేకరణలో సమస్యలను ప్రభుత్వం దృష్టికీ తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. త్రీ మెన్ కమిటీ సూచనల మేరకు చర్యలు చేపట్టాలని తెలియజేయడం జరిగిందన్నారు. తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు సంబంధిత అధికారుల నియామకం జరగాలని కోరినట్లు చెప్పారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో గరీబ్ భూములు గ్రామ కంఠాలు, వాస్తు మేరకు ప్లాట్ లు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయని వాటిని అధిగమించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. పొరపాట్లు గతంలో జరిగి ఉంటే వాటిని సరి చేయుటకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ నవంబర్ 28న రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కు క్యాబినెట్ ఆమోదం లభించిందన్నారు. ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయుటకు అవసరమగు అన్ని ఏర్పాట్లను కోసం చర్చించడం జరిగిందన్నారు. డిసెంబర్ ఐదో తేదీ నుండి గ్రామస్థాయిలో కార్యాలయాలు పనిచేయడం జరుగుతాయన్నారు.







