
ఫిబ్రవరి 22వ తేదీన నారాకోడూరు గ్రామంలో నిర్వహించబోవు జీడిఎస్ సమ్మేళనం కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ తమీం అన్సరియాతో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఈ నెల 22వ తేదీన గుంటూరుకు రాబోతున్నారు. కార్యక్రమంలో ముఖ్యంగా భారత్ నెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులకు సంబంధించి ముఖ్యమంత్రితో ఎంఓయూ చేసుకుంటారు.పోస్టల్ ఉద్యోగులను మోటివేట్ చేసే విధంగా బాగా పనిచేసిన వారిని సత్కరించే విధంగా పోస్ట్ ఆఫీస్ అభివృద్ధిని అందరికీ తెలియజేసేలా ఒక కార్యక్రమం చేయబోతున్నాము. సుమారు 9వేల మంది పోస్టల్ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మూడు గ్రామాలను కలిపి సమృద్ధి విలేజ్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించబోతున్నాము.అందులో ఒక గ్రామంగా చేబ్రోలు మండలంలోని నారాకోడూరు గ్రామాన్ని ఎంచుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా నారాకోడూరు గ్రామానికి కొన్ని ఉపయోగాలు అందబోతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి కాకుండా మరికొన్ని వైద్య సేవలు AI ద్వారా మరికొన్ని సేవలు అందించే అవకాశం ఉంటుందని చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీ వాత్సవ , DRO ఖాజావళి, CPMG శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.






