chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: ఏపీలో 3D ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి

AP MINISTER LOKESH TOUR IN MUMBAI

హెచ్ పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్&ఎండీ (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) ఇప్సితా దాస్ గుప్తాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో పర్సనల్ కంప్యూటింగ్, ప్రింటింగ్ సొల్యూషన్స్, హైబ్రిడ్ వర్క్ సొల్యూషన్స్ అండ్ గేమింగ్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ పి ఇన్క్. (HP Inc.,) 2024-25 ఆర్థిక సంవత్సరంలో $53.6 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారత్ లో రూ.17వేల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసిన హెచ్ పీ సంస్థ… ఐటీ హార్డ్ వేర్ పీఎల్ఐ స్కీమ్ కింద లబ్ధిపొందిన 27 సంస్థల్లో ఒకటిగా నిలచింది. ఈ సందర్భంగా ఇప్సితా దాస్ గుప్తాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో 3D ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుచేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. 2019లో HP Inc. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి 3D ప్రింటింగ్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తున్న నేపథ్యంలో తక్షణమే ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. HP ఇటీవలి కాలంలో డిక్సన్‌తో కలిసి భారతదేశంలో తన ఉత్పత్తిని రెట్టింపు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 కింద PCలు, ల్యాప్‌టాప్‌లు, వర్క్‌స్టేషన్ అసెంబ్లింగ్ (ప్రతి సంవత్సరం 5 లక్షల నుండి 10 లక్షల యూనిట్లు సామర్థ్యంతో), HP మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పండి. ఎలక్ట్రానిక్ హబ్ గా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో పీసీ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పార్క్‌లను (మదర్‌బోర్డులు, డిస్ ప్లేలు, బ్యాటరీలు, ఛార్జర్లు) అభివృద్ధి చేయండి. అలాగే HP సప్లై చైన్ భాగస్వాములను (Foxconn, Quanta, Inventec) ఆంధ్రప్రదేశ్‌కి రప్పించేలా సహకారం అందించండి. సెమీకండక్టర్ పాలసీ లింకేజీలతో కూడిన సమగ్ర క్లస్టర్‌ను ఏర్పాటులో భాగస్వామ్యం వహించండి. HP ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంప్యూటింగ్ (Omni బ్రాండ్ అభివృద్ధి), సస్టయినబుల్ ప్యాకేజింగ్ సొల్యూషన్లలో భారత మార్కెట్‌కు అనుగుణంగా స్థానిక ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారించండి. విశాఖపట్నం లేదా అమరావతిలో R&D సెంటర్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker