
గుంటూరులో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా మాధవ్ మాట్లాడుతూ స్వతంత్ర సేనాని అటల్ జీ విద్యాధికులు కవి రచయిత అజాతశత్రువు అటల్ జీ ప్రగాడ దేశభక్తి కలిగిన మహనీయులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వారసులు అటల్ బిహారీ వాజపేయి ఆసేతు హిమాచలం జాతీయ వాదాన్ని వినిపించిన సహనశీలి దేశ ప్రధాని గా విలువలతో కూడిన రాజకీయాలు దేశ ప్రజలకు పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి భారతరత్న అటల్ బిహారీ వాజపేయిఐక్యరాజ్యసమితి వేదికగా హిందీలో ప్రసంగం చేసి ప్రపంచానికి భారతదేశ ఆత్మగౌరవం వికసింప చేసిన వ్యక్తి గా చరిత్రలో నిలిచిపోతారు కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేయాలని ముందుండి నడిపించారు అదేవిధంగా గోవా విముక్తిను కూడా ఉద్యమంలో గోవా విముక్తి కోసం గుంటూరు వాసులు రమణారావు గారు కూడా ప్రాణాలర్పంచారుభారత్ పుణ్యభూమి నాదేశం కోసం జీవిస్తాం అవసరమైతే మరణిస్తాం కచ్ ఉద్యమం గోవధ నిషేధ చట్టం కోసం పోరాడటం చేశారుదేశంకోసం ఆటంబాంబు కావాలని ప్రోక్రాన్ అణు విస్సొటనాలతో శక్తిశాలి దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టారుఇందిరాగాంధీ నిరంకుశత్వానికి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ గా అత్యున్నత నిర్ణయాలు తీసుకుని దేశ కల్యాణం కోసం నిరంతరం ప్రయత్నించారు ముస్లీం జాతీయ వాది చావ్లా జీ 1980 లోనే చెప్పారు బిజెపి మాత్రమే దేశాన్ని నడిపిస్తుంది అనేటట్లు వాజ్పేయి గారి ప్రవర్తన ఉండేది జాతి సమగ్రత విలువలతో కూడిన రాజకీయాలు నడిపిన వ్యక్తిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారునేషనల్ ఫ్రంట్ వ్యవస్థలో తెలుగుదేశం తో కలిసి వాజపేయి స్నేహ హస్థానికి నిదర్శనం వ్యక్తిత్వం నిబద్ధత తో పదవులు కాదు ముఖ్యం దేశంకోసం బ్రతికారు చంద్రబాబు గారితో ప్రయాణం అద్బుత పాలన 2లక్షల గ్రామాలకు గ్రామీణ సడక్ యోజన గ్యాస్ కనెక్షన్ టెలీఫోన్ కనెక్టివిటీ విద్యకోసం సర్వశిక్షా అభియాన్ వ్యవస్థ నిర్మాణానికి ఆద్యులుగా నిలుస్తారని వారి సేవలను కొనియాడారు వాజ్పేయి స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి, బి. రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.







