
చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో మాట్లాడారు. కుప్పానికి త్వరలో 6,300 కోట్ల పెట్టుబడులతో మరో 8 కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మొత్తం స్థానికంగానే తయారు చేస్తామన్నారు. ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు సౌరవిద్యుత్ అందిస్తామని చెప్పారు.







