పెదనందిపాడు మండలం అనపర్రు బీసీ హాస్టల్లో అస్వస్థత గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సబిత, ఎమ్మెల్యే బి. రామాంజనేయులు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం స్కూల్లో, సాయంత్రం హాస్టల్ లో వివిధ రకాల ఆహారం తీసుకున్న కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. అయినప్పటికీ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో విద్యార్థులందరూ కోలుకుంటారని స్పష్టం చేశారు. గడచిన ఐదేళ్లలో విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలకు ఇలాంటి ఘటనల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
1,007 Less than a minute