
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వంవెంటనే చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తురకపాలెంలో మూడు నెలల్లో 30 మంది చనిపోవడం సంచలన సృష్టించిందని, జ్వరం రావడం, ఆసుపత్రిలో చేరడం, చనిపోవడం జరిగిందన్నారు అంబటి. ఈ వరుస మరణాలపై ప్రభుత్వం వెంనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తురకపాలెంలో వరుస మరణాల్లో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరలు ఇక్కడ పర్యటించారు. దీనిలో భాగంగా అంబటి మాట్లాడారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంలో భాగంగానే ఇక్కడకు రావడం జరిగింది.. వాటర్ పొల్యూషన్ జరిగిందని మాకున్న సమాచారం. గ్రామంలో సంజీవయ్య కుంటలోని నీటిని వాటర్ ట్యాంకు ద్వారా సరఫరా చేస్తున్నారు. నీటిసరఫరా సక్రమంగా జరగడం లేదు. తురకపాలెంలో బోర్లు వేసి గుంటూరులో నీటిని అమ్ముతున్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్రేషియా ఇవ్వాలి. ఆరోగ్య శాఖా మంత్రి ముందే స్పందిచవచ్చు కదా, ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ తీరు ఉంది’ అని అంబటి విమర్శించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. తురకపాలెంలో మరణాలు మిస్టరీగా ఉన్నాయి. ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతుంది. ఇలాంటి మరణాలకు ప్రభుత్వం సిగ్గుపడాలి. నీటికాలుష్యమే ప్రధాన కారణం. ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రతిపక్ష వైఎస్సార్స్పీపై నిందలు వేస్తున్నారు. ప్రజల సమస్యలపైనే వచ్చాయి. రాజకీయాలు చెయ్యడానికి కాదు.నీరు ఎలా కలుషితమయ్యిందో కూడా ప్రభుత్వం తెలుసుకోలేకపోవడం దారుణం’ అని ధ్వజమెత్తారు.








