
గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాలో 4,553 కుటుంబాలకు చెందిన 9,451 మంది ప్రజలకు పునరావాస కేంద్రాల్లో పునరావాసం కల్పించారు. రేషన్ కిట్లతోపాటు కుటుంబానికి గరిష్టంగా 3 వేల రూపాయలు నగదు పంపిణీ. తెనాలిలో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, తెనాలి పురపాలక సంఘం చైర్ పర్సన్ రాధిక, కమీషనర్ జె. రామ అప్పల నాయుడు, స్థానిక నాయకులు, అధికారులు







