రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈమేరకు
శాసనసభలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు.