ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: జిల్లాలో రహదారుల అభివృద్ధి కోసం రూ. 143 కోట్లు
CENTRAL MINISTER PEMMASANI PRESS MEET
గుంటూరు జిల్లా అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈమేరకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రహదారుల అభివృద్ధి కోసం 143 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దీంతో 12 రహదారులు, 5 వంతెనలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. రహదారుల అభివృద్ధి కోసం పీ.ఎం.జీ.ఎస్.వై నిధులు రావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు.