
మంగళగిరిలోని సికే కన్వెన్షన్ హాల్ లో జరిగిన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగుల మాటా మంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, అటవీ పర్యావరణ , అటవీ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశి భూషణ్ కుమార్, శిక్షణా సంస్థ కమిషనర్ ముత్యాలరాజు, రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్ కృష్ణ తేజ మైలవరపు, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ
రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగ్గా ప్రభుత్వ సేవలు అందించేందుకు గత సంవత్సరం ఆరునెలల కాలంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగిందన్నారు. ఉద్యోగులకు మరియు ప్రజలకు మంచి జరిగాలా పారదర్శకంగా రాడికల్ సంస్కరణలను అమలు జరుగుతున్నాయి అన్నారు. ఉద్యోగుల పదోన్నతులు బదిలీలు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. పల్లె పండుగ 2.0 లో గ్రామాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధి పథకాలకు ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 7000 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగుల కు మరింతగా ప్రయోజనం కల్పించేందుకు ఉపముఖ్యమంత్రి నిర్వహించిన మాట మంతి కార్యక్రమం ఉంది మంచి వాతావరణంలో జరిగిందన్నారు. మాటమంతి కార్యక్రమంలో ఉద్యోగులు తెలియజేసిన అన్ని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, అటవీ పర్యావరణ , అటవీ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎం జి ఎన్ ఆర్ జి ఈ ఎస్ డైరెక్టర్ వై వి కే షణ్ముఖ కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ బి బాలు నాయక్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ టీ గాయత్రి దేవి , ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ కే వెంకటకృష్ణ, సోషల్ ఆడిట్ డైరెక్టర్ జి శ్రీకాంత్. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జడ్పీ సీఈవోలు, డిపిఓ లు, డీడిఓలు, ఎంపీడీవోలు, పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.







