గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం డిసిసి, డి ఎల్ ఆర్ సి సమీక్షా సమావేశం జరిగింది. ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ కౌలు రైతులు, MSME, ఎడ్యుకేషన్ లోన్లు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సూర్యఘర్, విశ్వకర్మ తదితర స్కీమ్స్ సంబంధించినవి ఉన్నాయని చెప్పారు. అయితే వాటికి సంబంధించిన రుణాలు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. వాటికి సంబంధించిన సమస్యలు కారణాలు ఏమిటి అనేవి.. బ్యాంకర్లకు అందుతున్న అప్లికేషన్లు డేటా సంబంధిత వివరాలు ఎలాంటి కారణాలు ఆగుతున్నాయి అనేదానిపై చర్చించామని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ లోన్స్ జిల్లాలో చాలా తక్కువగా రుణాలు ఇచ్చారు. అలాగే కౌలు రైతులకు సంబంధించి యజమానులు ఎక్కువగా రుణాలు తీసుకున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. అందుకే కౌలు రైతులకు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఇలాంటి చాలా అంశాలపై ఈ సమావేశంలో చర్చించాము. రైతులు క్రాప్ లోన్ చెల్లించే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమయంలో లోన్లు కట్టలేకపోవచ్చు. అలాంటి లోన్లు కొన్నిసార్లు బ్యాంకర్లకు రాకపోయినా సరే సిద్ధమై బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలకు ఈ స్కీమ్స్, రుణాలపై ప్రత్యేకమైన అవగాహన కల్పించాలి. రుణాల విషయంలో టెక్నికల్ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంటుంది. కొన్ని బ్యాంకులు అయితే రుణాల మంజూరులో చాలా వెనుకబడి ఉన్నాయి. ఆ సమస్యల అన్నింటిని బ్యాంకులో త్వరితగతిన పరిష్కరించుకోవాలి. లేకపోతే పబ్లిక్ సెక్టార్లలో ఆయా వివరాలు చూపించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. పేదలకు, ప్రజలకు ఉపయోగపడేలా బ్యాంకర్ల పాలసీలు పనిచేయాలి. ప్రజలకు ఎవరైతే సరైన సర్వీస్ అందిస్తున్నారు. అలాంటి బ్యాంకర్లనే మేము అయినా ప్రమోట్ చేస్తాము. అప్పుడే ప్రజలైనా, పేదలైనా, రైతులైనా ఆనందంగా ఉంటారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏవైనా స్కీమ్స్ అమలు చేస్తున్నారంటే ఎంతో ప్రాధాన్యమిచ్చే అమలు చేస్తారని పెమ్మసాని తెలిపారు. ఈ సమావేశంలో మ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బి. రామాంజనేయులు, గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, బ్యాంకర్లు, అధికారులు పాల్గొన్నారు.
232 1 minute read