chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు

CENTRAL MINISTER VISIT GUNTUR

2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి ‘ఏపీ ఫైబర్ నెట్’ను ప్రారంభించామని.. దీనివల్ల ఖర్చు 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో వచ్చిన మార్పుల వల్ల వ్యవస్థలో గణనీయమైన పురోగతి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం ఫైజ్ 1, 2, 3 నిధులను సమకూరుస్తోందని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు.. కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేదని ప్రస్తావించారు.ఆదివారం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు కీలక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అప్పట్లో బ్యాండ్‌విడ్త్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తుచేశారు. ఎంతో కష్టపడి 2 Mbps బ్యాండ్‌విడ్త్ సంపాదించి, దానితోనే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించానని తెలిపారు. చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. తాను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో టెలికాం రంగంలో సంస్కరణల గురించి చర్చించానని ప్రస్తావించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని డీ-రెగ్యులేషన్ తీసుకురావాలని కోరానని అన్నారు. అప్పట్లో కాపర్ వైర్లను దొంగిలించి అమ్మేసేవారని తెలిపారు. తాను గతంలో అమెరికా పర్యటించిన సమయంలో ఫైబర్ తయారీని చూసి ప్రభావితం అయ్యానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటర్నెట్ విప్లవం వల్ల ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారుతుందని అప్పుడే గుర్తించానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బీఎస్‌ఎన్ఎల్ స్వదేశీ 4G సాంకేతికతను తీసుకురావడం ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. దీన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. గతంలో పాలసీ మేకర్లు ఐటీ గురించి పెద్దగా ఆలోచించలేదని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏఐపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రపంచ సదస్సులను నిర్వహిస్తోందని తెలిపారు. దాదాపు 970 సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నారని వివరించారు. భూ రికార్డులను క్యూ ఆర్ కోడ్ ద్వారా భద్రపరచడం వల్ల అవకతవకలకు తావుండదని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో ‘సంజీవని’ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. రాబోయే కాలంలో ఏఐ ట్యూటర్లు, డాక్టర్లు, అగ్రానమిస్టులు అందుబాటులోకి వస్తారని ప్రస్తావించారు. టూరిజం వంటి ఇతర రంగాల్లో కొత్త అవకాశాలు, సంపద సృష్టించవచ్చని పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker