
డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గుంటూరు గాంధీపార్క్ నుంచి బస్టాండ్ వరకు మంగళవారం ర్యాలీ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఐజీ త్రిపాఠి ర్యాలీని ప్రారంభించారు. మహమ్మారిలా విస్తరిస్తున్న మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్, తదితరులు పాల్గొన్నారు.







