
తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. “తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్లో 9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికి 5,540 కోట్లు కేటాయించారు, గతంతో పోలిస్తే ఇది 50శాతం అధికం. ఎన్నికలకు ముందు సూపర్-6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం” అని లోకేశ్ స్పష్టం చేశారు.








