
రాష్ట్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి రైతులకు యూరియా పంపిణీ చేశారు.ఎరువుల వినయోగంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ ఒక్క రైతు యూరియాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ అధికారుల సూచనతో వాడాలన్నారు. ప్రైవేటు వ్యాపారుల కంటే మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులు ఎక్కువగా ఇస్తున్నట్లు వివరించారు. రైతులు ఆందోళన చెంది మొత్తం యూరియా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రబీ పంటకు ఇప్పటికే ఎరువులు కేటాయించిందని అచ్చెన్నాయుడు తెలిపారు.








