అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఏపీనే అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి మండలం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చొరవతో త్వరలో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రేషన్ దుకాణాల్లో రాగులు, నూనె, గోధుమ పిండి, కందిపప్పు అందిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమే అని పేర్కొన్నారు.
232 Less than a minute