
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద సాల్మన్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి మీడియాతో మాట్లాడిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు రాష్ట్ర వ్యాప్తంగా వేల కుటుంబాల సాంఘిక బహిష్కరణ బడిలో కూడా పిల్లలను కులం పేరుతో వేధిస్తున్నారు దాడులు, అత్యాచారాలు, బహిష్కరణలు టీడీపీ పేటెంట్ అయింది సాల్మన్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలవుతున్నా ఇప్పటికీ రాజకీయ హత్యలతో దళితులు, బీసీలు, ముస్లింలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గురజాల నియోజకవర్గంలో ఇంటింటికీ మేం అభివృద్ధిని పరిచయం చేస్తే కూటమి ప్రభుత్వానికి అది చేతకాక హత్యా రాజకీయాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో వైయస్సార్సీపీకి అండగా నిలిచిన కుటుంబాలను గ్రామాల నుంచి తరిమేశాని, ఒక్క పిన్నెల్లి గ్రామంలోనే దాదాపు 300 కుటుంబాలను 20 నెలలుగా గ్రామంలోకి రానీయడం లేదని చెప్పారు. పీస్ కమిటీ వేసి వారిని పోలీసుల సమక్షంలో గ్రామంలోకి రప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశామని త్వరలోనే అందర్నీ గ్రామంలోకి వచ్చేలా చూస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి చేతనైతే మాకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలేకానీ ఎన్నికలు ముగిసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ రాజకీయాలు చేయడం దుర్మార్గమని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. హత్యలు, అఘాయిత్యాలు, వెలివేతలు, దాడులను తెలుగుదేశం ప్రభుత్వం పేటెంట్ తీసుకుని దళితులను వేధిస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో నిందితులను వదిలేసి బాధితులనే వేధిస్తున్న దుర్మార్గ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దళితులు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.సాల్మన్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.







