ఆంధ్రప్రదేశ్
AP LATEST NEWS: 18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు
SPORTS EVENT FOR MLAS
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 18, 19, 20 తేదీల్లో శాసనసభ్యుల కోసం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ పోటీలు రాజకీయ ఒత్తిడిని తగ్గించడంతో పాటు సభ్యుల్లో స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయన్నారు. పురుష ఎమ్మెల్యేల కోసం క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు, మహిళా ఎమ్మెల్యేల కోసం బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నీ కాయిట్, టగ్ ఆఫ్ వార్, వంద మీటర్ల పరుగు పందెం వంటి క్రీడలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే, పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం వంటి సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.