
అమరావతి:22-11-25:-ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది. రిజర్వేషన్ల ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.రిజర్వేషన్లు పూర్తయ్యే వెంటనే మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాలకు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.







