
“అమ్మ..” వారి అచంచలమైన ప్రేమ, మద్దతు మరియు త్యాగాలకు ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. తల్లులను గౌరవించడానికి ఆమె ప్రేమను తిరిగి ఆమెకు పంచడానికి ఈ ప్రపంచంలో ఏదీ సరిరాదు. అయితే అమ్మను గౌరవించే సాధారణ మార్గాలలో ఆమెతో ప్రేమతో మాటలు పంచుకోవడం, ప్రత్యేక బహుమతులు అందించడం మరియు వారితో కలిసి సమయాన్ని గడపడం ఉన్నాయి. అయితే ఒక సమాజ పరంగా మనందరం సంయుక్తంగా శారీ వాక్, 3కె రన్ ద్వారా ఆమెను గౌరవిద్దాం. ఈ వేడుక లో పాల్గొని మన జీవితాలను రూపొందించడంలో తల్లులు పోషించే కీలక పాత్రను మరియు మన శ్రేయస్సుపై అమ్మ ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ “మాతృ దినోత్సవం” సందర్భంగా మే 11 ఉదయం 6 గంటలకు మన మంగళగిరి లోనీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడలి వద్ద గౌతమ బుద్ధ రోడ్డులో నిర్వహించే కార్యక్రమంలో “శారీ వాక్” “త్రీ కె రన్” లో పాల్గొని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దామనీ “వీ – వైబ్” సంస్థ అధినేత రాఘ వీణ తెలిపారు. ఇందులో మొదటగా “శారీ వాక్” నిర్వహించి అందరికీ మెడల్స్ అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం “త్రీ కె రన్” ఉంటుందనీ ఆమె తెలియచేశారు.







