ఆంధ్రప్రదేశ్
AP NEWS: ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించారు. ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. అంతకుముందు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుకు పలువురు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయస్వామి, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.