ఆంధ్రప్రదేశ్

AP NEWS: జే.ఈ.ఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల విజయకేతనం

J.E.E MAINS RESULTS

జెఈఈ మెయిన్ – 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. శనివారం చంద్రమౌళినగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో జి. సాయిమనోజ్ఞ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించిన ఏకైక విద్యార్థిగా చరిత్ర సృష్టించిందన్నారు. జి. సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్తో పాటు ఫిమేల్ కేటగిరిలో ఆలిండియా టాపర్ గా నిలిచి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 18వ ర్యాంకును సాధించిందన్నారు. అదేవిధంగా కె.సాయి షణ్ముఖ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 52వ ర్యాంకును మరియు ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆలిండియా 2వ ర్యాంకును కైవసం చేసుకున్నారని తెలిపారు. వివిధ కేటగిరీలలో కె. సాయి షణ్ముఖ రెడ్డి ఆలిండియా 2వ ర్యాంకు, డి.సుభాష్ ఆలిండియా 8వ ర్యాంకు, పి. లక్ష్మినారాయణ ఆలిండియా 11వ ర్యాంకు, కె. యశ్వంత్ ఆలిండియా 13వ ర్యాంకు, జి.సాయిమనోజ్ఞ ఆలిండియా 18వ ర్యాంకు, కె. పార్థసారథి ఆలిండియా 20వ ర్యాంకు, డి. జశ్వంత్ బాలాజి ఆలిండియా 22వ ర్యాంకు, సిహెచ్. దివ్యశ్రీ ఆలిండియా 31వ ర్యాంకు, ఎన్.ఆకాష్ ఆలిండియా 32వ ర్యాంకు, షేక్ అబ్దుర్ రహీమ్ ఆలిండియా 40వ ర్యాంకు, ఎస్. వెంకటసాయి చక్రి ఆలిండియా 48వ ర్యాంకు, కె.ఎస్.సాయిరెడ్డి ఆలిండియా 52వ ర్యాంకు, జి. రాధాశ్యామ్ ఆలిండియా 52వ ర్యాంకు, టి.విక్రమ్ లెవి ఆలిండియా 57వ ర్యాంకు, సిహెచ్.మణికంఠ ఆలిండియా 64వ ర్యాంకు, కె.సాహిత్ ఆలిండియా 71వ ర్యాంకు వంటి 100లోపు 16 అత్యుత్తమ ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా 200లోపు 28 ర్యాంకులు, 500లోపు 60 ర్యాంకులు, 1000లోపు 82 ర్యాంకులు కైవసం చేసుకొని 73.24% సక్సెస్ రేట్తో తమ సత్తా చాటారన్నారు. ఇదే స్పూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్ డ్లో కూడా తమ విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘన విజయాలకు స్కూల్ స్థాయి నుండే మేమందించే భాష్యం ఐఐటి ఫౌండేషన్ కరిక్యులమే కారణమన్నారు. ఈ విజయానికి తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు చైర్మన్ రామకృష్ణ, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ హనుమంతరావు. మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రామ్లు అభినందనలు తెలిపారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button