AP NEWS: తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వ్యాధులపై అవగాహన కల్పించాలి
TALASEMIYA AWERNESS PROGRAME
తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వ్యాధులు జన్యుపరంగా వచ్చేవని, వీటిపై ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుణదల హయత్ ప్లేస్ హోటల్ లో సోమవారం రక్త సంబంధిత వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్సలో ఆధునిక పద్ధతులపై రెండు రోజుల శిక్షణ మరియు అవగాహనా (Orientation Training on Advance Modalities in Diagnosis and Treatment of Blood Diseases) కార్యక్రమాన్ని నేషనల్ హెల్త్ మిషన్, హీమోఫోలియా సొసైటీ లు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారని, దాదాపు 2,100 మంది తలసీమియాతో… ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారన్నారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధి అని, దీనికి మందులు వాడుతూనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమన్నారు. బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని 5 ఐసిహెచ్‌యస్ సెంటర్ల (Integrated Centre for Hemoglobinopathy and Hemophilia–ICHH) ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నామన్నారు. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స, మందులు అందిస్తోందన్నారు.