Vangaveeti Ranga is a man of the poor who transcends caste: Prathipati
వంగవీటి రంగా కులాలకు అతీతమైన పేదల మనిషి : ప్రత్తిపాటి
- వంగవీటి రాధా నాకు మంచి మిత్రులు… గతంలో ఎన్నికల ప్రచారం కూడా చేశారు : ప్రత్తిపాటి
- పవన్ కల్యాణ్ మద్ధతు.. బీజేపీ సహకారంతోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు : ప్రత్తిపాటి.
- రాష్ట్ర ఆర్థికవ్యవస్థను బాగుచేయాలంటే చంద్రబాబుకే సాధ్యమన్న పవన్ వ్యాఖ్యలు.. ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనం : ప్రత్తిపాటి.
- ఇర్లపాడు..అమీన్ సాహెబ్ పాలెం అభివృద్ధిని కోరుకునేవారు ప్రజల ప్రభుత్వానికి మద్ధతు తెలపాలి : ప్రత్తిపాటి
వంగవీటి రంగా పేదల మనిషని…ఆయన ఏ ఒక్క కులానికో పరిమితం కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా ప్రత్తిపాటి ఇర్లపాడు.. అమీన్ సాహెబ్ పాలెంలో పర్యటించారు. ఇర్లపాడులో కృష్ణారావు.. కృష్ణంనాయుడు ఏర్పాటుచేసిన వంగవీటి రంగా విగ్రహాన్ని ప్రత్తిపాటి ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
రంగా పేదల హృదయాల్లో ఉంటారు..
వంగవీటి రంగా సమాజం కోసం కష్టపడిన వ్యక్తి అని.. ఆయన ఎప్పుడూ ప్రజల హదృదయాల్లో నిలిచి ఉంటారని ప్రత్తిపాటి చెప్పారు. రంగా కుమారుడు రాధా తనకు మంచి మిత్రులని 2019లో ఎన్నికల ప్రచారానికి వచ్చారని.. 24 ఎన్నికల్లో కూడా ప్రచారానికి రమ్మని ఆహ్వానించానన్నారు. నిస్వార్థంగా ఆలోచించే నాయకుడు కాబట్టే రాధా.. ప్రజల కోసం కూటమిప్రభుత్వానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారన్నారు. రంగా విగ్రహా దాతలకు.. కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్తిపాటి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.
పవన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనం..
మార్కాపురంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయ పరిణితితో మాట్లాడారని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా… ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. చంద్రబాబుకే సాధ్యమన్న ఆయన వ్యాఖ్యల్ని ప్రజలు స్వాగతించాలని ప్రత్తిపాటి సూచించారు. పవన్ కల్యాణ్ మద్ధతు.. బీజేపీ సహకారంతోనే చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు ప్రగతిపథంలో నడుపుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. జగన్ దెబ్బకు బలైపోయిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే సామర్థ్యం చంద్రబాబుకే ఉన్నాయన్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే జగన్ సహా వైసీపీనేతలు భారీ మూల్యం చెల్లించుకున్నారని ప్రత్తిపాటి చెప్పారు. కూటమిప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబు.. పవన్ సమిష్టిగా జగన్ దుర్మార్గాలను ఎదిరించి పోరాడబట్టే 164 సీట్లు వచ్చాయన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం.. చంద్రబాబు అమలుచేస్తున్నారు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సంతోషంకోసం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, రూ.4వేల పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబేనని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.13వేల చొప్పున ప్రభుత్వం అందించిందన్నారు. రూ.2వేలను పాఠశాలల అభివృద్ధికి కేటాయించి, తల్లిదండ్రుల సూచనలప్రకారమే విద్యాసంస్థల్ని అభివృద్ధిచేస్తున్నారన్నారు. అర్హులైన వారికి తల్లికి వందనం…పింఛన్లు అందకుంటే సచివాలయ సిబ్బందే బాధ్యులవుతారు. త్వరలోనే అన్నదాతా సుఖీభవ.. మహిళలకు ఉచిత బస్సుప్రయాణం.. నిరుద్యోగ భృతి అమలవుతాయన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతిగ్రామానికి తాగునీరు అందుతోందన్నారు. బనకకచర్ల ప్రాజెక్ట్ పూర్తయితే నియోజకవర్గానికి తాగు..సాగునీటి సమస్య ఉండదని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసిందన్నారు. కూటమినాయకులు ప్రజల్లో ఉంటూ..వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని. ఏడాదిలో కూటమిప్రభుత్వం చేసిన మంచిని ప్రజలు గర్థించాలని ప్రత్తిపాటి కోరారు. ఇర్లపాడు..అమీన్ సాహెబ్ పాలెం గ్రామాల్లోని తాగునీటి సమస్య త్వరలో పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టిడిపి నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, పునాటి కోటేశ్వరరావు (పేద కాపు), కామినేని నాగేశ్వరరావు, కామినేని లలిత రాంజనేయులు, కృష్ణమనాయుడు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.