వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు సత్తెన పల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నేత, ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం, నాగమల్లేశ్వర రావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ బుధవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ చేరుకుంటారు. అక్కడ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
270 Less than a minute