వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో… రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్ధంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సులతో సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిది మంది స్టాఫ్ నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరువలేం. ఇటీవల సింగపూర్ లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చింది. మిమ్మల్ని కలసి మీరు అందించే సేవలు మరచిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
Read Next
4 hours ago
మావుళ్ళమ్మ అమ్మవారికి శ్రావణ మాస సారి సమర్పణ||Sari Offering to Mavullamma Goddess in Shravan Month
4 hours ago
తాడేపల్లిలో ప్రాణాల మీద శాపంగా కరెంట్ స్తంభం||Electric Pole Becomes Life Threat in Tadepalli
4 hours ago
నరసరావుపేటలో వర్ష బాధితులకు అండగా ఎమ్మెల్యే చదలవాడ||MLA Chadalawada Responds Swiftly to Rain Havoc in Narasaraopet
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
AP NEWS: కాలువల తవ్వకం పనులు మే నెలాఖరుకు పూర్తి చేయాలి - అవసరమైన చోట్ల 7రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లు
AP NEWS: కాలువల తవ్వకం పనులు మే నెలాఖరుకు పూర్తి చేయాలి - అవసరమైన చోట్ల 7రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లు
AP NEWS: కొల్లిపర లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్
AP NEWS: కొల్లిపర లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్
Related Articles
నరసరావుపేటలో 14.30 కోట్ల అన్నదాత నిధుల పంపిణీ – చదలవాడ||14.30 Cr Annadata Funds Distributed in Narasaraopet – MLA Chadlavada
2 days ago
ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్‌కు దరఖాస్తులు ప్రారంభం||Open School Admissions Begin for SSC & Inter in Vinukonda
2 days ago
Check Also
Close