AP NEWS : హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.
DSC PROBLEMS
మెగా డీఎస్సీలో గిరిజన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం. వేలాది గురుకుల మరియు రెసిడెన్షియల్ పాఠశాలల పోస్టులను మెగా డీఎస్సీలో కలిపిన విద్యాశాఖ. గిరిజన ప్రాంతాలలో గిరిజన అభ్యర్థులతో పూరించాల్సిన ఖాళీలను జనరల్ కేటగిరీలోకి మార్చిన విద్యాశాఖ. ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో రోడ్డున పడనున్న వేలాదిమంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అధ్యాపకులు. గత పది సంవత్సరాల పైగా చాలీచాలని జీతాలతో గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్తు అంధకారం అంటున్న గిరిజన అధ్యాపకులు. కేవలం గిరిజన సొసైటీ తో పూరించాల్సిన ఖాళీలు డీఎస్సీకి మరల్చడం ద్వారా వేలాదిమంది జీవితాలు రోడ్డున పడతాయి అంటున్న నిరుద్యోగ యువత. హైకోర్టును ఆశ్రయించనున్న గిరిజన ప్రాంతాల అధ్యాపకులు. గిరిజన నిరుద్యోగ యువతని నిలువునా ముంచిన నారా లోకేష్. గత ఎన్నికలలో జీవో 3 పునరుద్దిస్తానంటూ వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం. వాగ్దానాన్ని తుంగలో తొక్కి వేలాది గిరిజన పోస్టులను జనరల్ పోస్టులుగా మార్చిన వైనంపై వెల్లువెత్తుతున్న నిరసనలు. దీనిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. 2024లో ఇదే తరహాలో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో విద్యార్థుల తరఫున వాదనలు వినిపించిన శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించి గత డీఎస్సీ నుంచి పోస్టులను మినహాయించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. మరలా అదే తప్పు కూటమి ప్రభుత్వం చేస్తుండటంతో మరొకసారి హైకోర్టును ఆశ్రయించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. గిరిజన ప్రాంతాల్లో యువతీ యువకులకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన జడ శ్రవణ్ కుమార్