Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP POLITICAL NEWS: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు

EX MINISTER K SRINIVASULU PRESS MEET

రాయలసీమ సమగ్రాభివృద్ధికి శతాబ్దాల రాయలసీమ పేదరికాన్ని తొలగించడానికి చంద్రబాబు ప్రభుత్వం శక్తిమంతమైన చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. దీని ఫలితంగానే రాయలసీమకు అనేక పరిశ్రమలు వస్తున్నాయి. 2014 19 మధ్యకాలంలో రాయలసీమ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడ్డాయి. రాయలసీమ శతాబ్దాల కాలంగా కరువు కోరల్లో చిక్కి శల్యమైపోయిన కారణంగా ఈ సీమకు భవిష్యత్తు ఉంటుందో లేదో అనే ఆందోళన ఆవేదన అన్ని వర్గాల్లోనూ కొనసాగుతూ వచ్చింది. అయితే 2014 – 19 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి దాదాపు రూ.12,441 కోట్లు సీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారు. ఎన్టీఆర్ కలల రూపాలైన హంద్రీనివా సుజల శ్రవంతి, గాలేరు నగరికి సింహభాగం నిధులుచ్చి వాటి పనులను పరిగెత్తించారు. కాలువల మీదే సమీక్షలు చేసి తనిఖీలు నిర్వహించారు. చంద్రబాబు నీళ్లుఇస్తే పరిశ్రమ పెడతామని కియా యాజమాన్యం షరత్ పెడితే ఏడాది తిరగకుండా అనే బొల్లాపల్లి రిజర్వాయర్ ను నిర్మించి వాళ్లకు భరోసా కల్పించారు. రూ.13వేల కోట్లతో కియా పరిశ్రమ పెనుగొండ ప్రాంతంలో ఏర్పాటు కావడానికి కృషి చేసిన నాయకుడు చంద్రబాబు. కియా రాకతో అనంతపురమే కాదు రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోయింది. జగన్ పాలనలో అంధకారంలో సీమ: 2019-24 మధ్య కాలంలో రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ బిడ్డనని నమ్మించి ఓట్లు వేయించుకొని రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేశాడు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపకాల విషయంలో ఎన్ని గొడవలు జరుగుతాయో ఎంత రాద్దాంతం జరుగుతుందో అని అంతా భయపడ్డాం. కానీ చంద్రబాబు తన పాలన అనుభవంతో కేంద్ర ప్రభుత్వం వద్ద జరిగిన ఈ నీటి పంపకాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటాగా 811 టీఎంసిలు అయితే 512 టీఎంసిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించారు. అంత సెన్సిటివ్ ఇష్యూను, భావోద్వేగాల మధ్య ఏర్పడిన ఒక రాష్ట్రంతో ఉన్న సమస్య దాన్ని అత్యంత చాకచక్యంగా సామరస్యంగా పరిష్కారించి ఆంధ్రుల హక్కులను కాపాడిన నాయకుడు చంద్రబాబు అని కొంతమంది మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా. జగన్, తన అనుచరుల బెదిరింపులతో కియా అనుబంధంగా ఏర్పడాల్సిన చిన్న చిన్న పరిశ్రమలను కూడా తరిమికొట్టారు. అనేకమంది పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోయారు.ఎవరు కూడా రాయలసీమ వైపు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడాలని చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా వ్యవసాయాన్ని బతికించే పండ్ల తోటలను ప్రోత్సహించే బిందుసేద్యం ప్రాజెక్టును పూర్తిగా నిలిపి వేశాడు. డ్రిప్ సబ్సిడీ పూర్తిగా నిలిపివేశాడు. జగన్ ఐదేళ్ల పాలనలో సీమ రైతుల గొంతుకోశాడు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో మూడు టీఎంసిల నీళ్ళను తోడేస్తా రాయలసీమను సశ్యశామలం చేస్తాను అని చెప్పిన జగన్ దాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చి దాని అతిగతి లేకుండా చేశాడు. 2014-19 లో హంద్రీనీవా ప్రాజెక్టు రూ.1100 కోట్లు ఖర్చు చేసి దాదాపు 35% పనులు జరిగితే… 3850 క్యూసెక్కుల సామర్థ్యం కాదు నేను 10వేలకు పెంచుతా అని చెప్పి జరుగుతున్న పనులను కూడా జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆపేశాడు.కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల భవిష్యత్తును నాశనం చేశాడు. మళ్లీ చంద్రబాబు వచ్చాక 100 రోజుల్లోనే హంద్రీనీవా మొదటి దశ కాల్వల విస్తరణను పూర్తి చేసి 12 పంపుల ద్వారా 3850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాం. 40 టీఎంసీల వినియోగాన్ని 50 టీఎంసీల పెంచేలా పనిచేస్తున్నాం. ఒక్క ఏడాదిలో ఒక్క ప్రాజెక్టుకు రూ. 3870 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు. నీళ్లు ఇస్తే బంగారం పండించే రైతులు రాయలసీమలో ఉన్నారు. ఆ నీళ్లు ఎట్లా ఇవ్వాలని ఈరోజు సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణా డెల్టాలో వాడుకోవాల్సిన నీటిని రాయలసీమకు మల్లించాలనే ఒక గొప్ప ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పారిశ్రామిక పరంగా కూడా రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తోంది. ఓర్వకల్లు, కొప్పర్తిలో రూ.5 వేల కోట్లతో పారిశ్రామిక వాడల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఇదే కాకుండా దాదాపు 94 పరిశ్రమలు రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. రూ.3.52 లక్షల కోట్ల వేల కోట్లు ఖర్చుతో ఈ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. లక్షా 74వేల మంది ఉద్యోగాలు లభించబోతున్నాయి. రాయలసీమ ఒకవైపు హార్టికల్చర్ హబ్ గా మారి పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దుకుంటే దేశంలో ఏ ప్రాంతం రాయలసీమకు దీటుగా ఉండదు. యువగళం పాదయాత్ర సమయంలో కడపలో మంత్రి నారా లోకేష్ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ కి అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు. కడపలో మహానాడులో కడప నగరానికి కూడా కృష్ణా నీళ్లు ఇస్తామని ప్రకటన చేశారు. నేడు రూ.1664 కోట్లతో గాలేరు నగరి పనులు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. రాయలసీమ పేరు చెప్పి దశాబ్దాల కాలంగా రాసీమ కరువు, వెనకబాటుతనాన్ని రాజకీయ అవసరాల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డిలు వాడుకున్నారు. వారి పాలనలో రాయలసీమకు చేసింది ఏమీ లేదు. సొంతంగా కడపలో పెట్టాల్సిన ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా జగన్ ఎలాంటి చొరవ చూపలేదు. కూటమి ప్రభుత్వం జిందాల్ స్టీల్స్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కూడా చర్యలు తీసుకుందని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button