
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు పశ్చిమలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అంబటి తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైఎస్సార్సీపీ ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో, సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.







