
టీటీడీ విషయంలో కేవలం కల్తీ నెయ్యి కాదని, సబ్బులు, పెయింట్లు తయారీకి వాడే రసాయనాలను కలిపారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. 250 కోట్లను వైసీపీ నేతలు దోచుకున్నారని అన్నారు. ఇందులో సూత్రధారి అయిన వైవీ సుబ్బారెడ్డి గొడ్డలి పోటుకో లేదా గుండె పోటుకో గురయ్యే ప్రమాదం ఉందా అనే సందేహాలు, భయాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ లో కల్తీ చేసిన వారిని వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు.







