
అమెరికా పర్యటన దిగ్వజయంగా ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంధాయ పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావుకి పల్నాడు ప్రజానీకం అడుగడుగున స్వాగత నిరంజనం పలికారు. నకరికల్లు మండలం చల్లగుండ్ల అడ్డరోడ్డు నుంచి నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ వరకు అడుగడుగున అభిమానుల బాణసంచా కాల్పులు, పూలజల్లు, మహిళల హారతులతో అపూర్వమైన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అరవిందబాబు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మహిళలు యువత అధిక సంఖ్యలో విచ్చేసి ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన సభలో నేతలు ప్రసంగించార







