
అమరావతి: డెర్మటాలజీ పేరుతో జరుగుతున్న అనధికార సౌందర్య శస్త్రచికిత్సలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వ్యవహారాలపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (APMC) కీలక హెచ్చరికలు జారీ చేసింది. తగిన అర్హతలు లేని వారు ఈ విధి శస్త్రచికిత్సలు చేయరాదని మండలి స్పష్టం చేసింది.
అర్హతలేని వైద్యుల చేతుల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు
మండలి విడుదల చేసిన ప్రకటనలో, “సౌందర్య శస్త్రచికిత్సలు, లేజర్ ట్రీట్‌మెంట్‌లు, కెమికల్ పీలింగ్‌లు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లను సరైన సర్జికల్ ట్రైనింగ్ పొందిన వైద్యులే నిర్వహించాలి. అర్హతలేని వారు తలపెట్టిన చికిత్సలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం” అని తెలిపింది. ఇటీవల ఈ రంగంలో అనధికార వైద్యులు పెరిగినట్లు మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐఐఎంఎస్ మంగళగిరి లో ASPICON 2025 విజయవంతం – దేశవ్యాప్తంగా యాంటీమైక్రోబయిల్ స్టీవార్డ్‌షిప్ కోసం “ఏఐఐఎంఎస్ మంగళగిరి డిక్లరేషన్” ఆవిష్కరణ
MCI స్పష్టత: ఈ శస్త్రచికిత్సలు చేయగల అర్హతలేంటో ఖరారు
MD/DNB ప్లాస్టిక్ సర్జరీ, MD/DNB డెర్మటాలజీ (సంపూర్ణ సర్జికల్ ట్రైనింగ్‌తో) ఉన్న వారి ద్వారానే ఈ చికిత్సలు చేయాలని MCI (National Medical Commission) పూర్వమే తెలిపిందని APMC గుర్తు చేసింది.
డిసెంబర్ 20, 2022న జారీ చేసిన NMC నోటీసును కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, “మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించింది.
ఏ శస్త్రచికిత్సలు ఎవరు చేయాలి? APMC స్పష్టమైన నిబంధనలు
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ :ఫార్మల్ సర్జికల్ ట్రైనింగ్ ఉన్న MCh/DNB ప్లాస్టిక్ సర్జన్లు లేదా MD/DNB డెర్మటాలజిస్టులు మాత్రమే చేయాలి. మధుమేహ రోగులు తేలుగా తినగలారా? స్వీట్ కార్న్ విశ్లేషణ||Sweet Corn and Diabetes: A Balanced View
లేజర్, కెమికల్ పీలింగ్, బోటాక్స్ వంటి సౌందర్య చికిత్సలు
డెర్మటాలజీలో సరైన సర్జికల్ శిక్షణ పొందిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు మాత్రమే చేయాలి.ఇతర చికిత్సలు:MD డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు మాత్రమే నిర్వహించాలి. BDS లేదా ఇతర అర్హతలతో సౌందర్య శస్త్రచికిత్సలు చేయడం అనైతిక చర్యగా పరిగణిస్తామని మండలి పేర్కొంది.
“అనధికార సర్టిఫికెట్లు అమాన్యం” – మండలి
కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇస్తున్న
“కాస్మెటిక్ డెర్మటాలజీ డిప్లొమా”,
“ఎస్తటిక్ ప్రొసీడ్యూర్ కోర్సులు”,
“హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వర్క్‌షాప్ సర్టిఫికెట్”
మాదిరి పత్రాలు గుర్తింపు పొందినవి కావని APMC స్పష్టం చేసింది.ఇలాంటి కోర్సులు చేసి వైద్యులు తమ పేర్లకు అదనపు అర్హతలుగా జోడించరాదని, చేస్తే అది వృత్తి నైతికతకు విరుద్ధం (misconduct) అవుతుందని తెలిపింది.
గుర్తింపు లేని CME / వర్క్‌షాప్‌లపై కూడా హెచ్చరిక
అనధికారిక సంస్థలు నిర్వహించే ట్రైనింగ్, CME కార్యక్రమాలను APMC గుర్తించదని,
అలాంటి కార్యక్రమాలకు CME క్రెడిట్ గంటలు ఇవ్వబోవడం లేదని స్పష్టం చేసింది.ఆరోగ్య రక్షణ కోసం కఠిన చర్యలు తప్పవు: APMCప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం తాము కఠినంగా పర్యవేక్షిస్తామని,అర్హతలేనివారి పై శాసన చర్యలు,
అవసరమైతే నమోదు రద్దు వంటి చర్యలు తీసుకుంటామని మండలి హెచ్చరించింది.








