ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది ఉత్సవము

UGADI FESTIVAL IN GUNTUR

ఆదివారం స్థానిక శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ, దేవదాయ ధర్మదాయ శాఖ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది ఉత్సవము లు ఘనంగా జరిగాయి. నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయరు సజీలా, శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, రాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవల్మేంట్ కార్పోరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఉగాది ఉత్సవములను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో లక్ష్మీ కాంతం బృందం నాదస్వరము, రాధమాధవ నృత్య అకాడమీ విద్యార్దులు జనీషా, చైతన్య, లౌలీ, కీర్తీ, పూజీ, హేమ మాలినీ ఉగాధి లక్ష్మీకి జేజేలు, నవ వసంత లక్ష్మీకి జేజేలు, శివ శివ శంకర, జయజయ శంకర, అయిగిరి నందిని భక్తి గీతాలకు నృత్యాలు చేశారు. శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్మనాధ స్వామి పంచాంగ శ్రవణం చేసి, వేద ఆశ్వీరాదం అందించారు. అనంతరం శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్మనాధ స్వామి ని, అర్చకులు షణ్ముఖ రఘు కిషోర్ శర్మ, గంజాం రాధాకృష్ణమాచార్యులు, జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి,  వేద పండితులు చింతపల్లి నరసింహమూర్తి ని , వివిధ రంగాల్లో ప్రముఖులు సాంబశివరావు, భట్టు సిదానంద శాస్త్రి, మండవ నరిసింహారావు, గోగినేని రామారావు, హాజీ బేగ్ సాహెబ్, సయ్యద్ జానీ బాషా, కోల్లా వీరయ్య చౌదరీని కవులు డా. రావి రంగారావు, షేక్ ఖాసింబీ, డా. నల్లాన చక్రవర్తుల సుధామైథిలీ, చల్లా సత్యవతి రెడ్డి, డా. లయన్ గడల శివప్రసాద్ షేక్ అస్మతున్నీసా బేగం, నూతక్కి ప్రజ్ఞా చారి, ఏవీకే సుజాత, జానీ బాషా, బోమ్మ మహేశ్వరరెడ్డి లను నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయరు సజీలా, శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, రాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవల్మేంట్ కార్పోరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పోరేటర్లు దుశ్శాలువతో, మెమోంటో, ప్రసంశ పత్రం, నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించారు. అనంతరం కవిసమ్మేళనంలో కవులు ఉగాది కవితలు వినిపించారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయరు సజీలా, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలందరికి శ్రీ విశ్వవసు నామ ఉగాది అందరికి అయూరారోగ్యాలు, అష్టాశ్వరాలు అందించాలని , అందరికి సంతోషం, సౌబ్రాతత్వ, శుభం జరగాలని శుభాకంక్షలు తెలిపారు. ఉగాది సంతోషాన్ని అందరికీ పంచాలన్నా సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టడుగు వర్గాలు మేలు చేసేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అన్నారు .ఉగాది పర్వదినం, పవిత్రమైన రంజాన్ నెల,  శ్రమల దినాలు జరుగుతున్నాయని వీటన్నిటి ముఖ్య ఉద్దేశం అట్టడుగు వర్గాల ప్రజలకు సాయం అందించడమే అన్నారు. ఇటువంటి సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద కుటుంబాలను బంగారు కుటుంభాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, దాతలు, ప్రజలు, భాగస్వామ్యం (పీ4) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నారు. అందరి సంకల్పాలు నెరవేరి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో  మరింతగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button